Telugu Grammar - Basics
భాషాభాగాలు
•నామవాచకం: పేరుని తెలిపేవి. ఉదాహరణ:
1.శాన్ ఫ్రాన్సిస్కో నగరం చాలా పెద్దది.
2. శాన్వి పాఠశాలకి వచ్చింది.
3. తంగేడు పువ్వు పసుపు రంగులో ఉంటుంది
4. వేప చేదుగా ఉంటుంది.
5. కూచిపూడి, భరత నాట్యం శాస్త్రీయ నృత్యాలు.
•సర్వనామం: పేరుకు బదులుగా వాడే పదం. ఉదాహరణ:
అతడు ఆమె
ఇతడు ఈమె
వీడు వీరు
వాడు వారు
మేము మనం
జానకి నాకు మంచి స్నేహితురాలు, ఆమె బొమ్మలు బాగా వేస్తుంది.
మాకు ఒక కుక్కపిల్ల ఉంది. దానిపేరు మిష.
మనం ఈ పాఠం చదువుదామా?
మేము నిన్న సినిమాకి వెళ్ళాము.
నా పేరు రాము. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు నిషాంత్. మాకు మా తాతగారంటే చాలా ఇష్టం.
శ్రీకాంత్ మా పక్క ఇంట్లో ఉంటాడు. అతను రేపు ఇండియా నుండి వస్తున్నాడు.
•విశేషణం: గుణాన్ని తెలిపేవి.
నామవాచకాలు, సర్వనామాల యొక్క గుణాలను తెలిపే పదాలు విశేషణాలు. ఉదాహరణ:
•నల్లని ద్రాక్ష.
•తెల్లని పావురాలు.
•చల్లని పాలు.
•పచ్చని ఆకులు.
•తియ్యని లడ్డూలు
ఈ పదాలతో వాక్యాలు రాయడానికి ప్రయత్నించండి.
పుల్లని, పెద్ద, అందమైన, ఎర్రని, తెలివైన, చిన్న, బాగా, మంచి
•క్రియ : చేసే పనిని తెలిపేది. ఉదాహరణ:
వెళ్ళు, చదువు, మాట్లాడు, వచ్చాడు, తిను మొదలైనవి.
•పిల్లి పాలు తాగింది.
•నేను పాలు తాగుతున్నాను.
•రాము పాలు తాగుతున్నాడు.
•శ్రీలత పాలు తాగుతోంది.
•వాళ్ళు పాలు తాగుతున్నారు. / తాగారు.
ఈ పదాలతో వాక్యాలు రాయడానికి ప్రయత్నించండి. తిను, తినండి, తింటున్నాను, తిన్నాను, తింటున్నారు, తింటున్నాడు, తింటోంది, తిన్నావా? తింటున్నావా?
•సమాపక క్రియ: పనిని పూర్తిచేసినట్లు చెప్పే క్రియ
•అసమాపక క్రియ: పని పూర్తికాని స్థితిని తెలిపే క్రియ
అవ్యయము: లింగ, వచన, విభక్తులు లేనివి, ఆహా!, అలాగా!, భలే! మొదలైన పదాలు